సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో పొగలు.. ప్రయాణికులు సురక్షితం

by Thanuru Gopichand |   (  Updated:2026-01-20 07:24:05  IST  )

తరచూ చోటు చేసుకుంటున్న రైలు ప్రమాదాలు.

సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో పొగలు.. ప్రయాణికులు సురక్షితం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఇటీవల తరచూ రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత డిసెంబర్ 29న ఏపీలోని అనకాపల్ల సమీపంలో టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ ప్రెస్ ఏసీ భోగీలలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అదే విధంగా జనవరి 9న తుని-అన్నవరం మధ్య పూరి-తిరుపతి ఎక్స్ ప్రెస్ బి5 బోగీలో పొగలు రాగా ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రైల్వే సిబ్బంది మంటలను అదుపు చేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఈ రెండు ఘటనలను మరువక ముందే మరో రైలు ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం పొగలు రావడంతో సింహాద్రి ఎక్స్ ప్రెస్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో పొగలు వచ్చాయి. సాంకేతిక కారణాల వల్ల సమస్య తలెత్తినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో హంసవరం వద్ద లోకోపైలట్లు రైలును నిలిపివేశారు. గత రెండున్నర గంటల నుంచి సింహాద్రి ఎక్స్ ప్రెస్ హంసవరం వద్దనే నిలిచి ఉన్నట్లు ప్రయాణికులు పేర్కొంటున్నారు. అయితే రైలు మరమ్మతుల అనంతరం తిరుగు ప్రయాణం అవుతుందని.. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

Next Story