కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-11 05:57:41  IST  )

ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్ బోగిలో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ బోగీలో పొగలు.. ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ (Krishna Express) రైలులో పెను ప్రమాదం తప్పింది. రన్నింగ్‌లో ఓ బోగి కింద నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రైన్ నెల్లూరు సిటీకి చేరుకుంటున్న తరుణంలో లోకో పైలట్ అప్రమత్తమయ్యారు. రైలులో మంటలు చెలరేగుతున్నాయనే భయంతో ప్రయాణికులు చైన్ లాగి రైలును అక్కడికక్కడే నిలిపివేశారు. భయాందోళనతో ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు. లోకో పైలట్ సమాచారం మేరకు రంగంలోకి దిగిన రైల్వే సాంకేతిక సిబ్బంది బోగీని పరిశీలించి బ్రేక్ షూలు జామ్ కావడం (Brake Binding) వల్ల రాపిడి జరిగి పొగలు వచ్చాయని తేల్చారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత ట్రైన్ గమ్య స్థానానికి యథావిధిగా కదిలింది.

Next Story