శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ సంచలన లేఖ.. ప్రభుత్వం సీరియస్

by Vemula.Srinu Prasad |

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వానికి సిట్ లేఖ రాసింది......

శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ సంచలన లేఖ.. ప్రభుత్వం సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం(Srivari Laddu Adulteration Case)పై ప్రభుత్వానికి సిట్(SIT) లేఖ రాసింది. 2019-24 మధ్య లడ్డూ ప్రసాదం(Laddu Prasadam)లో జరిగిన తప్పిదాలను వివరించింది. అలాగే జరిగిన పరిణామాలు, దర్యాప్తులో తేలిన అంశాలను లేఖలో ప్రస్తావించింది. లడ్డూలో జరిగిన కల్తీ జరిగినట్లు నిర్ధారించడంతో పాటు భవిష్యత్ దిద్దుబాటు చర్యలపైనా సిట్ అధికారులు లేఖలో సూచించారు. అయితే ఈ లేఖను పూర్తిగా అధ్యయనం చేయాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి.

మరోవైపు లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ క్లీన్ చిట్ అంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై ప్రభుత్వం సిరియస్ అయింది. తప్పుడు ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. శ్రీవారి భక్తుల విశ్వాసం, టీటీడీ ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

Next Story