లిక్కర్ కేసులో సిట్ పిటిషన్‌ విచారణ వాయిదా

by Naga Rani Yarlagadda |

ఏపీ లిక్కర్ కేసులో సిట్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్ప బాలాజీని సిట్ కస్టడీకి కోరింది.

లిక్కర్ కేసులో సిట్ పిటిషన్‌ విచారణ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ కేసు (AP Liquor Scam Case)లో సిట్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్, గోవిందప్ప బాలాజీని సిట్ కస్టడీకి కోరింది. దీనిపై తీర్పును నేటికి రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు (ACB Court).. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసేందుకు ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నేడు విచారణ చేయనుంది. గోవిందప్ప బాలాజీ (Govindappa Balaji) ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులోనే మరో నిందితుడైన సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కూడా నేడు ఏసీబీ కోర్టు విచారణ చేయనుంది.

Next Story