- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్ కేసు.. తొలిరోజు కస్టడీలో వాసుదేవరెడ్డికి ప్రశ్నల వర్షం
ఏపీ లిక్కర్ కేసులో నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం లావాదేవీలకు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ కేసు(AP Liquor Case)లో నిందితుడు వాసుదేవరెడ్డి(Accused Vasudeva Reddy)ని సిట్ అధికారులు(SIT officials) గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం లావాదేవీలకు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధాన సుత్రదారులేవరంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్నింటికి వాసుదేవరెడ్డి సమాధానాలు చెప్పినట్లు సమాచారం. మరికొన్నింటిని దాటవేసినట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం విచారణ ముగియడంతో తొలిరోజు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. శుక్రవారం వాసుదేవరెడ్డిని విచారించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు. తొలిరోజు విచారణ ముగియడంతో మళ్లీ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను మరింత విచారించేందుకు సిట్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో వాసుదేవరెడ్డిని తొలిరోజు అదుపులోకి తీసుకుని విచారించారు. శుక్రవారం విచారణపై వాసుదేవరెడ్డి అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో వాసుదేవ రెడ్డి ఏ2 నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు.






