- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: సిట్ కస్టడీకి వైవీ సుబ్బారెడ్డి పీఏ.. రూ.50 లక్షల లంచంపై ప్రశ్నల వర్షం
తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అయ్యప్పను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు....

దిశ, వెబ్ డెస్క్: తిరుమల కల్తీ నెయ్యి కేసు(Tirumala adulterated ghee case)లో వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(Former TTD Chairman YV Subba Reddy) పీఏ చిన్న అయ్యప్పను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఐదు రోజుల కస్టడీలో భాగంగా ఈ రోజు అయ్యప్పను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీటీడీ(TTD)కి నెయ్యి సరఫరా చేసిన ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థల(Premier Agrifoods Companies) ప్రతినిధుల నుంచి రూ. 50 లక్షల తీసుకున్నారన్న అభియోగంపై ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అసలు నెయ్యి సరఫరా వెనుక ఇంకా ఎంత మంది ఉన్నారు...?, మాజీ చైర్మన్ వైసీపీ సుబ్బారెడ్డి పాత్ర ఉందా అనే అంశాలపై చిన్న అయ్యప్పను ప్రశ్నిస్తున్నారు. అయ్యప్ప బ్యాంకు లావాదేవీలపైనా విచారించినట్లు తెలుస్తోది. ప్రస్తున్న అయ్యప్ప కస్టడీ కొనసాగుతోంది. పూర్తి కస్టడీ తర్వాత అయ్యప్ప నుంచి ఎలాంటి ఆధారాలు సేకరిస్తారో చూడాలి.






