లిక్కర్ కేసులో శ్రవణ్ రావు ముగిసిన విచారణ.. నిందితులతో పరిచయాలపై ఆరా

by Vemula.Srinu Prasad |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు...

లిక్కర్ కేసులో శ్రవణ్ రావు ముగిసిన విచారణ.. నిందితులతో పరిచయాలపై ఆరా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు(AP Liquor Scam Case)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ రోజు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు(Telangana phone tapping case accused Sravan Rao)ను విచారించారు. ఈ కేసు నిందితులకు శ్రవణ్ రావు దుబాయ్‌(Dubai)లో ఆశ్రయం ఇచ్చారని విచారణలో తేలడంతో విచారణకు హాజరుకావాలని ఆయనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఉదయం శ్రవణ్ రావు సిట్ అధికారులు ఎదుట హాజరయ్యారు. దీంతో పలు ప్రశ్నలు సంధించారు. దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. నిందితులు కిరణ్ కుమార్‌రెడ్డి, సైఫ్, అహ్మద్, వరుణ్ కుమార్, శివకుమార్, సైమన్, ప్రసన్, ప్రద్యుమ్నా, అవినాష్ రెడ్డి, అనిరుద్‌రెడ్డిలు ఎలా పరిచయం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. వాళ్లంతా ఓ స్నేహితుడి ద్వారా పరిచమైనట్లు శ్రవణ్ రావు తెలిపినట్లు తెలుస్తోంది. అయితే నిందితులకు ఆశ్రయం ఎందుకు కల్పించారన్న ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉన్నారని సమాచారం.

Next Story