- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి బిగ్ షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు
లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి సిట్ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం(AP Liquor Scam)లో సిట్ అధికారులు దూకుడు పెంచారు. నిందితుడు కసిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్(Hyderabad Jubililee Hills)తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా కసిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో సిట్ అధికారులు సీరియస్ అయ్యారు.
కాగా లిక్కర్ స్కాంలో కసిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నారు. విచారణకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై ఆయన స్పందించలేదు. పైగా విచారణకు డుమ్మా కొట్టారు. కసిరెడ్డి ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బంధువు. వైసీపీ హయాంలో కసిరెడ్డి ఐటీ సలహాదారుగా పని చేశారు. మద్యం తయారీ దారుల నుంచి రూ. 60 కోట్లు వసూలు చేశారని, అంతేకాదు రూ. 3 వేల కోట్ల వరకూ జగన్ ప్యాలెస్‌కు చేర్చారని కసిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసి ఈ దందా నిడిపినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కంపెనీల నుంచి మద్యం ఎంతకు కొనుగోలు చేయొచ్చు..ఏ రోజు ఏ బ్రాండు విక్రయించాలనేది కసిరెడ్డినే నిర్ణయించేవారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో ఈ గుట్టు రట్టు చేసేందుకే లిక్కర్ స్కాంను కూటమి ప్రభుత్వం సిట్‌కు అప్పగించిందని పలువురు అంటున్నారు. ప్రస్తుతం కసిరెడ్డి ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో






