మద్యం కేసులో పెను సంచలనం.. ముంబై షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లింపు..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-31 09:59:05  IST  )

ఏపీ మద్యం కేసులో సిట్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది...

మద్యం కేసులో పెను సంచలనం.. ముంబై షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లింపు..?
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మద్యం కేసు(Ap Liquor Case)లో సిట్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. నిందితుడు వరణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాచి ఉంచిన రూ. 11 కోట్లను గుట్టు రట్టు చేసిన సిట్ అధికారులు.. ఇప్పుడు షెల్ కంపెనీల భరతం పట్టేందుకు రెడీ అయింది. ముంబైలోని పలు షెల్ కంపెనీలకు మద్యం డబ్బులు మళ్లించేందుకు నిందితులు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ముంబైలోనూ విచారణ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై‌లో ఉన్న అన్ని షెల్ కంపెనీలను పరిశీలించి రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి అందించేందుకు రెడీ అవుతున్నారు.

కాగా గత ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు మాజీ అధికారులతో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సైతం సిట్ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో సిట్ విచారణ ఉత్కంఠగా సాగుతుంది. నెక్ట్స్ అరెస్ట్ కాబోతోంది ఎవరు అనే ప్రశ్నలు వైసీపీకి చెందిన పలువురిలో గుబులు పుట్టిస్తున్నాయి.

Next Story