నకిలీ మద్యం కేసులో సిట్ చార్జిషీట్.. వెలుగులోకి మరిన్ని విషయాలు

by Vemula.Srinu Prasad |

నకిలీ మద్యం కేసులో సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది..

నకిలీ మద్యం కేసులో సిట్ చార్జిషీట్.. వెలుగులోకి మరిన్ని విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసు(fake liquor case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఎక్సైజ్ కోర్టు(Vijayawada Excise Court)లో సిట్ అధికారులు చార్జిషీట్ దాఖలు చేశారు. మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) అండతోనే ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో అద్దేపల్లి జనార్దన్ రావు నకిలీ మద్యం తయారు చేశారని చార్జిషీట్‌లో తెలిపారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగేందుకే జనార్దన్ రావుతో ములకలచెరువులో జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ చేయించారని పేర్కొన్నారు. మద్యం వ్యవహారంలో మొత్తం 8 మంది నిందితుల పాత్ర ఉందని చార్జిషీట్‌లో నిర్దారించారు. ఈ కేసులో ఏ1గా అద్దెపల్లి జనార్దన్ రావు, ఏ2 జగన్మోహన్ రావు, ఏ4 రవి, ఏ7 బాదల్ దాస్, ఏ8 ప్రదీప్ దాస్, ఏ11 శ్రీనివాసరెడ్డి, ఏ12 తిరుమల శెట్టి శ్రీనివాసరావును చార్జి షీట్‌లో పేర్కొన్నారు.

Next Story