- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవంగా సిరిమానోత్సవం.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగుబంగారమై ఉన్న పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు విజయనగరంలో ఘనంగా జరుగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి, భక్తుల కొంగుబంగారమై ఉన్న పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు విజయనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం అమ్మవారి సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, ప్రస్తుతం గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సిరిమానోత్సవం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు.






