పూజారి రమణాచారి ఆమరణ నిరాహార దీక్ష.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-06 16:15:04  IST  )

శింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయం పూజారీ రమణాచారి ఆమరణ దీక్షకు దిగారు..

పూజారి రమణాచారి ఆమరణ నిరాహార దీక్ష.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా శింగనమల(Singanamala)లో అధికార పార్టీ నాయకుల తీరు వివాదాస్పదంగా మారింది. స్థానిక దుర్గాంజనేయ స్వామి ఆలయం (Durganjaneya Swamy Temple) విషయంలో దౌర్జనానికి పాల్పడ్డారు. అంతేకాదు పూజారి రమణాచారిపై దాడి చేశారు. ఆయన ఇంట్లోకి చొరబడటమే కాక సామగ్రిని సైతం ధ్వంసం చేశారు. దీంతో పూజారి రమణాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ(Tdp) నేతల దాడిని ఖండిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు. ప్రాణం పోయినా సరే దీక్షను విరమించనని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదని పూజారి రమణాచారి(Priest Ramanacharya) చెప్పారు.

శనివారం మధ్యాహ్నం తనపై రాజకీయ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. దుర్గాంజనేయ స్వామి ఆలయం తమకు అప్పగించాలని కొందరు అధికార పార్టీ నాయకులు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన క్షేత్రం, మతం, సంప్రదాయాన్ని కాపాడుకోవాలన్నారు. తన ప్రాణ త్యాగం వృధాగా పోకూడదని తెలిపారు. దుర్గాంజనేయ స్వామి ఆలయంలో రాజకీయ పార్టీల కమిటీలు తమకు ఇష్టం లేదని తెలిపారు. ఆలయాన్ని పార్టీ నాయకులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై, తన మతంపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని తెలిపారు. దీక్షను భగ్నం చేయడానికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని పూజారి రమణాచారి హెచ్చరించారు.

Next Story