Sports city: గుజరాత్ స్టేడియం తరహాలోనే.. అమరావతిలో.. !

by Thanuru Gopichand |

ఏపీ రాజధాని అమరావతిని సకలహంగులతో తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

Sports  city: గుజరాత్ స్టేడియం తరహాలోనే.. అమరావతిలో.. !
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ రాజధాని (Amaravathi) అమరావతిని సకలహంగులతో తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా అమరావతిలో క్రీడలు నగరాన్ని (Sports City) నిర్మించాలని తలపెట్టింది. ఇందులో భారీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (cricket stadium) నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం ఆనుకుని ఉన్న కృష్ణలంక భూములను మంత్రి నారాయణ (Amaravathi) పరిశీలించారు. ఇక్కడే క్రీడా నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. క్రికెట్ స్టేడియాన్ని నిర్మించే ప్రయత్నంలో భాగంగా మంత్రి నారాయణ రెండు రోజుల గుజరాత్ప ర్యటన చేపట్టారు. ఈరోజు ఉదయం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. కేవలం 9 నెలల్లో స్టేడియాన్ని నిర్మించిన విధానాన్ని గుజరాత్ క్రీడల శాఖ అధికారులు వివరించారు. అమరావతిలో నిర్మించనున్న స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం నిర్మించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన చేపట్టామని ఆయన తెలిపారు. తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

కృష్ణా నది తీరంలో క్రీడా నగర నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు 2000 ఎకరాల్లో క్రీడా నగరాన్ని నిర్మించనున్నారు. లంక భూములు క్రీడానగరం ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నారు. క్రీడానగరం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, నెలరోజుల్లోగా కమిటీ నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తామని నారాయణ నాలుగు రోజులకు కిందట ప్రకటించారు.

ముందుగా ఈ రోజు గుజరాత్ పర్యటన రెండవ రోజు భాగంగా గ్యాస్పూర్‌లోని జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను మంత్రి నారాయణ సందర్శించారు. ఘన వ్యర్థాల నుంచి విద్యుత్‌, పేవర్ బ్లాక్స్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ప్రతి రోజూ పెద్ద ఎత్తున వచ్చే ఘన వ్యర్థాలను డికంపోజ్ చేసే విధానాన్ని అధికారులు వివరించారు

Next Story