- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. శాశ్వత చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో ఈ పాలకమండలిని రూపకల్పన చేశారు. ఈ బోర్డుకు కేంద్ర మాజీ మంత్రి, పూసపాటి వంశీయులు పి.అశోక్ గజపతిరాజు శాశ్వత చైర్మన్‌గా వ్యవహరించనున్నారు...

దిశ, వెబ్ డెస్క్: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Simhachalam Varaha Lakshmi Narasimha Swamy Temple) నూతన ట్రస్ట్ బోర్డు(Trust Board)ను ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. మొత్తం 17 మంది సభ్యులతో ఈ పాలకమండలిని రూపకల్పన చేశారు. ఈ బోర్డుకు కేంద్ర మాజీ మంత్రి, పూసపాటి వంశీయులు పి.అశోక్ గజపతిరాజు(P. Ashok Gajapathiraju) శాశ్వత చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. అలాగే ఆలయ సీనియర్ ప్రధాన అర్చకుడికి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ బోర్డులో స్థానం కల్పించారు. ఈ నూతన ట్రస్ట్ బోర్డు పదవీ కాలం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది. ఉత్తరాంధ్రలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనే ధ్యేయంగా ఈ కమిటీ పనిచేయనుంది. బోర్డు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.
రాజకీయ సమీకరణాల పరంగా..
రాజకీయ సమీకరణాల పరంగా చూస్తే ఈ కమిటీలో కూటమి భాగస్వామ్య పక్షాలకు తగిన ప్రాధాన్యత దక్కింది. మొత్తం సభ్యులలో తెలుగుదేశం పార్టీ నుంచి 13 మంది, జనసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరికి చోటు కల్పించారు. అన్ని వర్గాలకూ, కూటమిలోని పార్టీలకూ సమతూకం పాటిస్తూ ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టింది.






