Pawan kalyan: వెండితెరే వేదిక.. థియేటర్లో పవన్​తో ‘మాటా మంతి’

by Thanuru Gopichand |

పవర్​స్టార్​గా పవన్​కల్యాణ్​థియేటర్​లోని తెరపై కనిపిస్తే అభిమానుల్లో సందడి నెలకొంటుంది.

Pawan kalyan: వెండితెరే వేదిక.. థియేటర్లో పవన్​తో ‘మాటా మంతి’
X

• థియేటర్లోనే ప్రజలతో ఆన్​లైన్​లో ముఖాముఖి

• డీసీఎం పవన్ కళ్యాణ్ యోచన

* ప్రజలకు చేరువయ్యేలా వినూత్న ఆలోచన

* రేపు టెక్కలి గ్రామంలోని థియేటర్లో వీడియో సమావేశం

* 175 నియోజకవర్గాల్లో ఇదే తరహా మీటింగులు

దిశ, డైనమిక్ ​బ్యూరో : పవర్​స్టార్​గా పవన్​కల్యాణ్​థియేటర్​లోని (Theater's) తెరపై కనిపిస్తే అభిమానుల్లో సందడి నెలకొంటుంది. అదే వెండితెరపై ఆయన ఉపముఖ్యమంత్రి స్థానంలోంచి ప్రజలకు కనిపించనున్నారు. వెండితెరనే వేదికగా చేసుకుని ప్రజలతో ఆన్​లైన్​లో ముఖాముఖి నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి మన ఊరు - మాటా మంతి (Mana ooru Mata manti అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమం కార్యక్రమం రేపు టెక్కలి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్‌లో వెండితెర ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వనున్నారు.

వీడియో కాన్ఫరెన్స్ (Vedio conference)​ ద్వారా స్థానిక ప్రజలతో పవన్​కల్యాణ్​మాట్లాడతారు. గ్రామీణులతో నేరుగా మాట్లాడే విధంగా స్థానిక సినిమా హాళ్లను వాడుకోవాలని యోచిస్తున్నారు. పబ్లిక్​, ప్రైవేటు, పంచాయతీరాజ్​, పార్టనర్​షిప్​తో గ్రామీణాభివృద్ధిపై దృష్టి పెట్టడం దీని ఉద్దేశం. మొదటి దశలో రాష్ట్రంలోని కొన్ని గ్రామాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించనున్నారు. వారిత తాగునీరు, ఆస్పత్రి, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించాలని నిర్ణయించారు. గ్రామస్థులకు దగ్గరగా ఉన్న థియేటర్​లో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల గ్రామస్తులతో ఇదే తరహాలో మాట్లాడాలని పవన్​యోచిస్తున్నట్లు సమాచారం. రేపు శ్రీకాకుళం జిల్లా రావివలస ప్రజలతో సమావేశం కానున్నారు. వీరితో టెక్కలి (Tekkali) సినిమా హాలులో వీడియో కాన్ఫరెన్స్​ద్వారా మాట్లాడతారు.

Next Story