TDP MLA : ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?

by Y. Venkata Narasimha Reddy |

తన వివాదస్పద వ్యవహారశైలితో పార్టీకి నష్టదాయకంగా మారిన ఆ ఎమ్మెల్యేను టీడీపీ వదిలించుకుంటుందా...అతనిపై క్రమశిక్షణ చర్యలతో సరిపెడుతారా అన్నది పార్టీలో ఆసక్తికరంగా మారింది.

TDP MLA : ఆ టీడీపీ ఎమ్మెల్యేపై వేటు తప్పదా?
X

దిశ, వెబ్ డెస్క్ : తన వివాదస్పద వ్యవహారశైలితో పార్టీకి నష్టదాయకంగా మారిన ఆ ఎమ్మెల్యేను టీడీపీ వదిలించుకుంటుందా...అతనిపై క్రమశిక్షణ చర్యలతో సరిపెడుతారా అన్నది పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్(AP) తిరువూరు(Thiruvur) ఎమ్మెల్యే కొలికపూడి కొలికపూడి శ్రీనివాస రావు(MLA Kolikapudi Srinivasa Rao)టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. సోమవారం టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

జనవరి 11వ తేదీన ఎ.కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళ భూక్యా చంటిపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి ఘటనను పార్టీ హైకమాండ్ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే వివాదాస్పద విషయాల్లో తలదూర్చవద్దని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా మరోసారి కొలికపూడి వివాదంలో చిక్కుకున్నారు. గిరిజన మహిళపై దాడి చేయడం కొలికపూడి దాడి చేయడంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు.

క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లనుంది క్రమశిక్షణ కమిటీ. క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి ఇచ్చే సమాధానంపై సంతృప్తి చెందని పక్షంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. గతంలో రైతులపైన, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కొలికపూడి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.

Next Story