తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-12 08:09:18  IST  )

తిరుమల(Tirumala) శీ వేంకటేశ్వరస్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

తిరుమల శ్రీవారికి ఖరీదైన కానుకలు.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శీ వేంకటేశ్వరస్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కానుకలు కూడా సమర్పిస్తుంటారు. తిరుమల శ్రీవారికి సినీ రాజకీయ ప్రముఖులు, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు భారీగా విరాళాలు(Donations) అందజేస్తుంటారు. అయితే.. భక్తులు స్వామివారికి ఎక్కువగా నగదు, నగలు కానుకలుగా సమర్పిస్తుంటారనే విషయం తెలిసిందే.

కానీ.. తాజాగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఖరీదైన రెండు బైక్‌లు కానుకగా వచ్చాయి. చెన్నైకి చెందిన TVS, బెంగళూరుకు చెందిన NDS ఎకో సంస్థలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను(Electric two-wheelers) విరాళంగా సమర్పించారు. ఆయా సంస్థల ప్రతినిధులు నిన్న(మంగళవారం) టీటీడీ అధికారులకు రెండు ద్విచక్ర వాహనాలను విరాళంగా అందజేశారు.

TVS అందించిన ఐక్యూబ్ ఎక్స్ వాహనం ధర రూ.2.70 లక్షలు, ఎన్డీఎస్ ఎకో అందించిన వాహనం ధర రూ.1.56 లక్షలు ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అనంతరం ఆలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ద్విచక్ర వాహనాలను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి(Venkaiah Chowdary)కి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఏఈవో(TTD AEO) వారిని అభినందించారు.

Next Story