- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా?వద్దా?: టీడీఎల్పీ సమావేశంలో వాడీ వేడి చర్చ
ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో : ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే అంశంపై టీడీపీ మల్లగుల్లాలు పడుతుంది. ఇందులో భాగంగా టీడీఎల్పీ సమావేశం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ భేటీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జూమ్ ద్వారా ఈ టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. గురువారం నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలా? వద్దా అనే అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చర్చిస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్, తదనంతరం జరుగుతున్న పరిణామాలు, టీడీపీ నేతలపై నమోదు అయిన కేసులు, పొత్తుల అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వొద్దని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనకు దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు వస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు 70 ఎంఎం సినిమా చూపిస్తామని మంత్రి జోగి రమేశ్ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్లపైనా టీడీపీ నేతలు చర్చిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటిని పరిశీలిస్తే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే దానికన్నా బయటే ఉండి నిరసన తెలిపితే బెటర్ అనే అభిప్రాయాన్ని పలువురు సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తే చంద్రబాబు అరెస్ట్‌ను తదితర అంశాలపై నిలదీసే అంశాలపై చర్చిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేదానికన్నా బయట ఉండి నిరసన తెలపడమే బెటర్ అనే అభిప్రాయం అత్యధికమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలో ఉన్నట్లు తెలుస్తోంది.






