Postal Negligency : షాకింగ్..పాడుబడ్డ ఇంట్లో ఉత్తరాలు..పోస్టల్ శాఖ నిర్వాకం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-01-22 07:42:51.0  )
Postal Negligency : షాకింగ్..పాడుబడ్డ ఇంట్లో ఉత్తరాలు..పోస్టల్ శాఖ నిర్వాకం
X

దిశ, వెబ్ డెస్క్: ఓ ఉత్తరం ఆలస్యం.. జీవితాల స్థితిగతులనే మార్చిన ఘటనలు ఎన్నో ఉన్నా..పోస్టల్ శాఖ నిర్లక్ష్యం(Postal Department Negligency) చాటే ఘటనలు తరుచూ వెలుగుచూస్తునే ఉన్నాయి. చేరాల్సిన అడ్రస్ కు చేరకుండా ఉత్తరాలు బస్తాల్లో..చెత్త కుప్పల్లో, పోస్టల్ కార్యాలయాలలో కనిపించిన ఘటనలు గతంలో చూశాం. ఈ దఫా మాత్రం బట్వాడా కాని ఉత్తరాలు(Undelivered Letters) ఓ పాడుబడ్డ ఇంట్లో(Dilapidated House)దర్శనమిచ్చిన నిర్వాకం పోస్టల్ శాఖ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేసింది.

ఈ ఘటన ఏపీ లోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది. అడ్రస్ ప్రకారం డెలివరీ చేయాల్సిన వివిధ రకాల ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఆధార్ కార్డులు, ఉత్తరాలు అన్ని పాడుబడ్డ ఒక ఇంట్లో చెల్లాచెదురుగా పడేసి కనిపించాయి. అది చూసిన స్థానికులు వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ గా మారింది. ముఖ్యమైన ఉత్తరాలు అడ్రస్ మేరకు ప్రజలకు అందించకుండా ఇలా పాడుబడ్డ ఇంట్లో వేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఆ ఉత్తరాలు అందని వారిలో ఎవరెవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో.. ఏ విధంగా నష్టపోయారోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పోస్టల్ శాఖపై నమ్మకం సడలకుండా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed