- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. దిమ్మతిరగడం ఖాయం!
మాచర్లలో గత నెలలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం జరిగిన కేసులో ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. మంచినీటి కోసం వచ్చి అత్యాచారం చేయడంపై ఏకంగా సీఎం కూడా సీరియస్ అయ్యారు. తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్ తెరమీదికి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ తాజాగా పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. నిందితుడు బాధితురాలికి స్నాప్ చాట్ లో పరిచయమైన ప్రియుడేనని తేలింది. మార్చి 2న ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.
బాధిత మహిళకు గతంలోనే పెళ్లవ్వగా.. విడాకులు తీసుకుని భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమెకు స్నాప్ చాట్ లో రాజుపాలెం మండలానికి చెందిన నామాల శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. బాధితురాలే అతని గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ పంపి.. శ్రీనివాస్ ను ఇంటికి పిలిపించుకుంది. ఆ తర్వాత శ్రీనివాస్ ఆమెపై బలవంతానికి ప్రయత్నించగా.. ప్రతిఘటించింది. ఆగ్రహానికి గురైన అతను.. ఆమెను వివస్త్రను చేసి కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారం చేసి పరారయ్యాడు. పరిచయస్తుడే ఈ నేరానికి పాల్పడ్డాడని చెప్తే.. ఎవ్వరూ నమ్మరని భావించిన ఆమె.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తప్పుడు ఆధారాలు పేర్కొన్నదని ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మార్చి 8న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిన్న కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించింది.






