- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shocking: పొలంలో షాకింగ్ సీన్.. బిత్తరపోయిన రైతు
ఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో రైతుకు పొలంలో షాకింగ్ ఘటన ఎదురైంది. .

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో రైతుకు పొలంలో షాకింగ్ ఘటన ఎదురైంది. రోజూ మాదిరిగా వ్యవసాయం చేయాలనుకున్న ఆయనకు అక్కడున్నది చూసి వణికిపోయారు. ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇంటికెళ్లి అందరికి చెప్పారు. అనంతరం పోలీసులకు స్టేషన్‌కు వెళ్లి చెప్పుకున్నారు.
కర్నూలు జిల్లా పెద్దకడుబూరులో రైతుకు అనూహ్య ఘటన ఎదురైంది. పొలం పనికి వెళ్లిన ఆయనకు ఒక్కసారిగా దిమ్మతిరిగింది. ముందు రోజు పని చేసి వెళ్లిన తనకు మరుసటి రోజు పొలంలో కనిపించిన దానిని చూసి షాక్ గురయ్యారు. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు తన పొలంలో పసుపు, కుంకుమతో పాటు దిష్టి బొమ్మ పెట్టి క్షుద్ర పూజలు చేసి ఉండటంతో భయపడి పోయారు. వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు.
మరోవైపు బాధిత రైతు కుటుంబం ఆందోళన వ్యక్తం చేస్తోంది. గ్రామంలో తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఇలా ఎందుకు చేశారోనని ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో పని చేయాలంటే ఒంటిలో వణుకు వస్తుందని వాపోయారు.






