- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రూప్-1 బ్యాచ్ అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్, 2018 గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, 2018 గ్రూప్-1 నియామకాలపై సుప్రీంకోర్టు(Supreme Court)లో శుక్రవారం విచారణ జరిగింది. ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అభ్యర్థులు సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగానే ఉన్నాయన్న సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రాధాన్యత ఉన్న పోస్టులు ఇవ్వకపోతే ఉద్యోగాలు చేయలేరా..? అని అభ్యర్థులను ప్రశ్నించింది. ఎక్కడ ఉన్నా జీతం వస్తుంది కదా అని సూచించింది. ఉన్నదాంతో సంతృప్తి పడాలని ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. దీంతో హైకోర్టు ఆదేశాలు యథాతథంగా అమల్లో కొనసాగనున్నాయి. ఈ తీర్పుతో నియామకాల ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి తొలగినట్లు భావిస్తున్నారు. సంబంధిత అభ్యర్థులకు పోస్టుల కేటాయింపులో స్పష్టత లభించడంతో త్వరలోనే తదుపరి పరిపాలనా చర్యలు చేపట్టే అవకాశముంది.






