- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి షాక్.. బీజేపీలో చేరిన వరకృష్ణ
పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రెల్లి కుల సంఘ నాయకుడు, వైసీపీ నేత మాడుగుల వరకృష్ణ బీజేపీలో చేరారు.

X
దిశ, ప్రతినిధి, విజయవాడ: పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రెల్లి కుల సంఘ నాయకుడు, వైసీపీ నేత మాడుగుల వరకృష్ణ బీజేపీలో చేరారు. సుజనా చౌదరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు మాజీ కేంద్రమంత్రి సయ్యద్ షాన్ వాజ్ హుస్సేన్ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వరకృష్ణకు కేంద్ర మంత్రి సూచించారు. అనంతరం వరకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని చెప్పారు. అయినా కూడా పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన చెందారు. కాగా, వరకృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో రెల్లి కుల సంఘ నాయకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, రాష్ట్ర నాయకులు పలువురు పాల్గొన్నారు.
Read More..
Next Story






