Kakani Govarhdan : కాకానికి .. షాక్

by Thanuru Gopichand |

మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్​కు హైకోర్టులో చుక్కెదురైంది.

Kakani Govarhdan : కాకానికి .. షాక్
X

* కేసు నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరణ

* క్వాష్ పిటిషన్ రెండు వారాలకు వాయిదా

* విచారణకు మూడుసార్లు డుమ్మా

* మాజీ మంత్రి కాకాని అరెస్టు తప్పదా?

దిశ, డైనమిక్​ బ్యూరో: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్​కు హైకోర్టులో (Hign court) చుక్కెదురైంది. ఆయన క్వాష్​పిటీషన్​పై విచారణను కోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది. దీంతోపాటు ఆయనకు కేసు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరించింది. క్వార్ట్జ్​అక్రమ రవాణా కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి పిటీషన్​ వేశారు. ఆయన ప్రస్తుతం అజాఞతంలో ఉన్నారు. విచారణకు హాజరు కావాలని మూడుసార్లు నోటీసులిచ్చినా ఆయన హాజరు కాలేదు. మరోవైపు హైదరాబాద్‌లోనే ఉన్నానంటూ ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో కాకాణి ఫొటోలు పోస్టింగ్​లు వస్తున్నాయి. సెల్​ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు హైదరాబాద్​లోని ఇంటికి వెళ్లినా అక్కడ దొరకడం లేదు. హైకోర్టులో ఆయన వేసిన క్వాష్​పిటీషన్​విచారణకు వచ్చి తీర్పు వెలువడే వరకు ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకుండా కాలం గడుపుతున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనపై పోలీసులు చర్యలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆయనను అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story