అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీ.. శోభా గ్రూప్ రూ.100 కోట్ల విరాళం

by Muthe.Rajitha |

ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో వరల్డ్ క్లాస్ లైబ్రరీ నెలకొల్పేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.

అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీ.. శోభా గ్రూప్ రూ.100 కోట్ల విరాళం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లో వరల్డ్ క్లాస్ లైబ్రరీ నెలకొల్పేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అయితే ఇందుకోసం శోభా గ్రూప్ ఆఫ్ కంపెనీ రూ.100 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా నేడు దుబాయ్ లో శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్‌, సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)తో సమావేశం అయ్యారు. అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు శోభా గ్రూప్ ముందుకు రావటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

పీ4 విధానంలో జీరో పావర్టీకి ప్రభుత్వ ప్రయత్నాలను, రాజధానిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. శోభా రియాల్టి సంస్థ కూడా ఇందులో భాగస్వామి కావాలని, ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. 3 ఏళ్లలో అమరావతిలో రహదారులు, నీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు సిద్ధం అవుతాయని తెలిపారు.

విశాఖలో గూగుల్ డేటా ఏఐ హబ్, అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కానున్నాయని, రాష్ట్రంలోని తిరుపతి, విశాఖ, అమరావతి లాంటి నగరాలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని చెప్పారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని మీనన్‌ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.

Next Story