- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలంలో శివ స్వాముల ఆందోళన.. పుణ్యక్షేత్రంలో అధికారుల తీరుపై ఆగ్రహం
by Ramesh Naini |
శ్రీశైలం పుణ్యక్షేత్రం లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో ఉన్న భక్తులు, శివ స్వాములు ఆదికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సోమవారం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. క్యూలైన్లలో ఉన్న భక్తులు, శివ స్వాములు ఆదికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నా దర్శనం జరగకపోవడంపై శివ స్వాములు అధికారులపై మండిపడ్డారు. దర్శనం కోసం క్యూలైన్స్, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు కళ్ళు తిరిగి పడిపోతున్నారని శివ స్వాములు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా శివ స్వాములు క్యూలైన్ గేట్లు ఎక్కి బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి ఏఎస్పీ యుగంధర్ బాబు , జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి తీసుకోచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఏఎస్పీ యుగంధర్ బాబు లాఠీతో బెదిరిస్తూ శివదీక్ష భక్తులను చెదరగొట్టి కంట్రోల్ లోకి తెచ్చారు.
Next Story






