YSR కొడుకై ఉండి కూడా.. జగన్ ఆ పనిచేశారు: షర్మిల సంచలన ట్వీట్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు.

YSR కొడుకై ఉండి కూడా.. జగన్ ఆ పనిచేశారు: షర్మిల సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం(NDA Govt)పై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘ఏడాది పాలన అంతా గొప్పల మయం. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ సర్కార్. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతీ రైతుకు రూ.20వేలు ఇస్తామని ఇంతవరకూ ఇవ్వలేదు. తల్లికి వందనం పథకాన్ని నీరుగార్చారు. నిరుద్యోగులను మోసం చేశారు. మహిళా శక్తి స్కీమ్ ప్రస్తావనే తీసుకురావడం లేదు. గ్యాస్ ఒక్కటి అరకొర ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదీ పత్తా లేదు. ఈ పథకం తెలంగాణ, కర్ణాటకలో అద్భుతంగా అమలు చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ అనేక హామీలు అటకెక్కించారు.

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ మూడు బీజేపీ పార్టీలే. ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్(YS Jagan) కూడా బీజేపీకి ఊడిగం చేశారు. YSR కొడుకు అయ్యి ఉండి బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి బాబు(Chandrababu), పవన్(Pawan Kalyan) ఊడిగం చేస్తున్నారు. బీజేపీ గత 11 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది. ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ఇలా అన్ని హామీల్లో మోసం చేసింది. అయినా కానీ ఒక్కరు కూడా నోరు మెదపరు’ అని ఎక్స్ వేదికగా షర్మిల సంచలన ట్వీట్ పెట్టారు. ట్వీట్

Next Story