విశాఖలో షర్మిల నిరాహార దీక్ష

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-21 08:39:00  IST  )

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ (Vizag Steel Plant)ను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (PCC Chief YS Sharmila) నిరవధిక నిరాహాల దీక్ష చేపట్టారు.

విశాఖలో షర్మిల నిరాహార దీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ (Vizag Steel Plant)ను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (PCC Chief YS Sharmila) నిరవధిక నిరాహాల దీక్ష చేపట్టారు. స్టీల్ ప్లాంట్ లో విధుల నుంచి తొలగించిన 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇతర డిమాండ్లను కూడా యాజమాన్యం పరిష్కరించాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. కార్మికుల సమ్మెకు మద్దతుగానే తాను నిరాహార దీక్షకు దిగినట్లు తెలిపారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్న షర్మిల.. స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్ కార్మికులకు ఆమె మద్దతు తెలిపారు.

2021లో నాటి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకోగా.. అప్పటి నుంచి వైఎస్ షర్మిల దీక్ష చేస్తూనే ఉన్నారు. మే 6వ తేదీన ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిన షర్మి.. బీజేపీ హయాంలో స్టీల్ ప్లాంట్ కు కష్టాలు వచ్చాయని విమర్శించారు. అదానీకి మేలు చేయాలని స్టీల్ ప్లాంట్ ను చంపేస్తున్నారని ఆమె ఆరోపించారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని షర్మిల గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్లో 34 వేల మంది ఉద్యోగులు ఉంటే.. 11 సంవత్సరాల్లో కారణం లేకుండా అనేకమందిని తొలగించారని ఆరోపించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్లో 20 వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారన్నారు.

Next Story