Zero Shadow: మిట్టమధ్యాహ్నం విచిత్రం..

by Naga Rani Yarlagadda |

సాధారణంగా పగటిపూట సూర్యుడి కాంతి మనపై పడినపుడు ఏదో ఒక పక్కన నీడ కనిపిస్తుంది. కానీ.. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ మాత్రం..

Zero Shadow: మిట్టమధ్యాహ్నం విచిత్రం..
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి ఈనెల 14వ తేదీ వరకూ ఏపీలో విచిత్ర సంఘటన జరగబోతోంది. మిట్టమధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయం కానుంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ (ఐఏఎస్సీ) జాతీయ కన్వీనర్ మేకా సుసత్యరేఖ వెల్లడించారు. దీనిని జీరో షాడో(Zero Shadow) గా పిలుస్తారని తెలిపారు.

సాధారణంగా పగటిపూట సూర్యుడి కాంతి మనపై పడినపుడు ఏదో ఒక పక్కన నీడ కనిపిస్తుంది. కానీ.. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకూ మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్య కిరణాలు మనుషులపై లంబంగా పడటం వల్ల రెండు నిమిషాలపాటు నీడ మాయమవుతుందని సుసత్య వివరించారు. భూమి అక్షం 23.5 డిగ్రీలు వంపుగా ఉండటం వల్ల సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయంలో సూర్యుడి స్థానం ఉత్తర, దక్షిణ దిశల్లో మారుతుంటుందని, ఈ సమయంలో ప్రతి సంవత్సరం కర్కాటక, మకరరేఖల మధ్యనున్న ప్రదేశాల్లో సూర్యకిరణాలు భూమిపై సంపూర్ణ లంబంగా పడతాయని తెలిపారు. ఫలితంగా నిలువుగా ఉండే వస్తువులు నీడ కనిపించదని, మనుషుల నీడ కూడా అందుకే మాయం అవుతుందన్నారు.

Next Story