రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఏడుగురు చిన్నారులు మృతి

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-18 13:37:58  IST  )

‌ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు మృతిచెందారు.

రాష్ట్రంలో తీవ్ర విషాదం.. ఏడుగురు చిన్నారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్:‌ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు చిన్నారులు మృతిచెందారు. విజయనగరం(Vizianagaram) జిల్లా ద్వారపూడిలో కారులో ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతిచెందారు. ఆదివారం మధ్యాహ్నం ఆడుకునేందుకు ఆగివున్న కారులో ఎక్కారు. ఇంతలో డోర్లు లాక్ అయ్యాయి. బయటకు ఎలా రావాలో తెలియక కారులోనే చాలాసేపు సతమతమై.. నలుగురూ మృతిచెందారు. దీంతో ద్వారపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు చిత్తూరు(Chittoor) జిల్లా కేంద్రానికి సమీపంలో నీటిసంపులో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటన కుప్పం(Kuppam) మండలం దేవరాజపురంలో చోటుచేసుకుంది. ఒకే రోజు ఏడుగురు చిన్నారులు మృతిచెందటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story