- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, ఏపీ బ్యూరో : ఏడుగురు న్యాయవాదులకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు మేరకు ఈ జాబితా విడుదలైంది. జడ్జిలుగా పదోన్నతి పొందిన వాళ్లలో కొనగంటి శ్రీనివాస్ రెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, రవి చీములపాటి, వి.సుజాత ఉన్నారు. ఈ నెల 29న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జరిగిన సమావేశంలో కొలీజియం ఇందుకు ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి.
Next Story






