- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయండి: Minister Nara Lokesh
రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ వెళ్లారు. ఈ తరుణంలో ఇప్పటికే పలు కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మూడో రోజు పర్యటన సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఎస్ టి టెలీ మీడియా ఇన్వెస్టిమెంట్స్(ఇండియా) హెడ్ రీతూ మెహ్లావత్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. భారత్ లో కార్యకలాపాలను రెట్టింపు చేయాలని భావిస్తున్నందున డేటా సిటీగా ఆవిష్కృతమవుతున్న విశాఖపట్నంలో ఎస్ టి టెలి మీడియా గ్రీన్ ఎనర్జీ డేటా సెంటర్ ఏర్పాటు చేయండని కోరారు. ఉత్తర ప్రదేశ్ తరహాలో అత్యాధునిక డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల కల్పన, ఆప్టిమైజేషన్ ద్వారా బలమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని మంత్రి లోకేష్ కోరారు.
ఈ విషయం పై రీతూ మెహ్లావత్ స్పందిస్తూ.. భారత్ లో తాము ప్రస్తుతం 10 ప్రధాన నగరాల్లో 311 మెగా వాట్ల క్రిటికల్ ఐటీ లోడ్ తో 30 డేటా సెంటర్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారత్ లో తమ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని 550 మెగా వాట్లకు పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను సంస్థ ఉన్నత స్థాయి బృందం దృష్టికి తీసుకెళ్లి, నిర్ణయం తీసుకుంటామని రీతూ మెహ్లావత్ తెలిపారు.






