- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు
ఏపీలోని వైయస్ఆర్ కడప జిల్లా పోక్సో స్పెషల్ కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని వైయస్ఆర్ కడప జిల్లా పోక్సో స్పెషల్ కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2024 ఏప్రిల్‌లో 14 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కడప పోక్సో స్పెషల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేరాన్ని 'రేరెస్ట్ ఆఫ్ రేర్'గా పేర్కొని యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా POCSO సెక్షన్ 6, IPC సెక్షన్ 376, 363 కింద రూ.10 వేల జరిమానా (చెల్లించకపోతే మరో 2 సంవత్సరాల జైలు) విధించింది.
అదే విధంగా బాధిత బాలికకు రూ.10.50 లక్షల పరిహారం DLSA ద్వారా 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. జడ్జి ఎ. రామకృష్ణ బాలికల రక్షణ సమాజ బాధ్యత అని, ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేసారు. కాగా 18 నెలల్లో 15 సాక్షులు, 25 డాక్యుమెంట్లతో విచారణ పూర్తయిన ఈ తీర్పును కడప పోలీసులు, మహిళా సంఘాలు స్వాగతించాయి.






