ఇది నిజంగా మహా ద్రోహం: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-21 13:06:20  IST  )

తమిళనాడులో ఈరోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఒక చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు....

ఇది నిజంగా మహా ద్రోహం: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లో ఈరోజు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఒక చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(Former MP Vijayasai Reddy) అన్నారు. డీఎంకే(DMK)తో పొత్తు వదిలి టీవీకేకు మద్దతివ్వడంపై ఆయన స్పందించారు. కేవలం రెండు రాష్ట్ర మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ (INC) తన అత్యంత పాత మిత్రపక్షాలలో ఒకటైన డీఎంకే‌తో ఎలా బంధాన్ని తెంచుకుందో ఈ వేడుక స్పష్టం చేస్తోందని విజయసాయి ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో డీఎంకే నిలకడగా కాంగ్రెస్‌కు అండగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. రాజకీయాలు అంటే అధికారమే కావచ్చని.. కానీ కూటములు నడవాలంటే పరస్పర నమ్మకం, విధేయత కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఇది నిజంగా 'మహా తమిళనాడు ద్రోహమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Next Story