జనసేన ఆవిర్భావ దినోత్సవం.. మాజీ మంత్రి సంచలన ట్వీట్!

by Jakkula.Mamatha |

ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన(Janasena) పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

జనసేన ఆవిర్భావ దినోత్సవం.. మాజీ మంత్రి సంచలన ట్వీట్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన(Janasena) పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు(శుక్రవారం) జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరగనుంది. పిఠాపురం(Pithapuram)లో ‘జయకేతనం’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) స్థాపించిన రాజకీయ పార్టీ జనసేన నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకొనుటకు సిద్ధంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati rambabu) సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘‘బాబు కోసం పుట్టిన తమ్ముడు పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు!’’ అంటూ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు అంబటి రాంబాబు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story