- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ఎన్నికల ఫలితాలపై స్వామి పరిపూర్ణనంద సంచలన జోస్యం
పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల సమయం

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజల్లోనూ నరాలు తెగే ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై పరిపూర్ణనంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీనే గెలుస్తుందని, జగన్ రెండో సారి ఏపీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. 123 స్థానాలు కైవసం చేసుకుని వైసీపీ ఏపీలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని గ్రామీణ మహిళలు అధిక శాతం వైసీపీకే ఓట్లు వేశారని తెలిపారు. ఇక, తాను పోటీ చేసిన హిందుపురం నియోజకవర్గంలో ఎవరూ ఊహించని ఫలితం వస్తోందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇక, సెంట్రల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ... దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ సాధించబోతుందన్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తోందని చెప్పారు. మోడీ మూడోసారి భారత ప్రధాని అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓ ముఖ్యమైన వ్యక్తి ద్వారా అందిన సమాచారం మేరకు ఈ విషయం చెబుతున్నానని అన్నారు.






