YS Sharmila: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-10 12:54:11  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన లేఖ రాశారు.

YS Sharmila: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన లేఖ రాశారు. విజయవాడ(Vijayawada)కు చెందిన దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohan Ranga) పేరును నగరంలోని ఓ రహదారికి పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే విజయవాడ పశ్చిమ బైపాస్(West Bipas) జాతీయ రహదారికి వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని ఏపీసీసీ(APCC) చీఫ్ వైఎస్ షర్మిల ఈ రోజు(సోమవారం) కోరారు.

ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాజా టోల్ గేట్ నుంచి చిన్న అవుటపల్లి వరకు 47.8కిమీ దూరం గల బైపాస్ పూర్తి కావొచ్చినందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఈ బైపాస్‌తో ట్రాఫిక్ కష్టాలు కొంత తగ్గుతాయి. ప్రజలకు వంగవీటి మోహన రంగా చేసిన సేవ అనిర్వచనీయమని ఆమె తెలిపారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం వాదించి, పేదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన రంగా పేరు పెట్టండి అని వైఎస్ షర్మిల లేఖలో పేర్కొన్నారు.

Next Story