సిరాజ్ గ్యాంగ్ టార్గెట్ వాళ్లే.. ఉగ్రకుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-21 12:44:17  IST  )

ఉగ్రకుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

సిరాజ్ గ్యాంగ్ టార్గెట్ వాళ్లే.. ఉగ్రకుట్ర భగ్నం కేసులో సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం ఉగ్ర కుట్ర(Vizianagaram terror conspiracy)ను పోలీసులు భగ్నం చేసి సిరాజ్, సమీర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ అయితే కేసు దర్యాప్తులో పెను సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్ఎస్ఎస్ నేతల(RSS leaders)ను సిరాజ్ గ్యాంగ్(Siraj Gang) టార్గెట్ చేసినట్లు పోలీసు విచారణ(Police Investigation)లో వెల్లడైంది. సిరిజ్-సమీర్ మధ్య సిగ్నల్ యాప్, ఇన్ స్టా చాటింగ్ సాగినట్లు పోలీసులు గుర్తించారు. పేలుడు పదార్థాల తయారీ ల్యాబ్ ఏర్పాటుకు ప్లాన్ చేసిన సిరాజ్, సమీర్ లారెట్ లాంచర్లు తయారీ పై తెలుసుకున్నట్లు తేలింది. జేసీబీలు, మసీదులపైకి వస్తే దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు వాళ్లిద్దరి బ్యాంకు లాకర్లను పోలీసులు ఓపెన్ చేయనున్నారు.

మరోవైపు 3 సార్లు సౌదీ వెళ్లిన సిరాజ్.. అక్కడ ఉగ్రవాద పెడలర్స్‌ను కలిశాడు. ఇక సిరాజ్ పాస్ పోర్టులో ఏ దేశం వెళ్లినట్లు కూడా స్టాంపింగ్ లేదు. ఏ పాస్ పోర్టుపై ఇతర దేశాలకు వెళ్లాడనేదానిపై పోలీసులు దృష్టి పెట్టారు.త్వరలోనే ఆ విషయాలు సైతం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తోయో చూడాలి.

Next Story