మూడో రోజు విచారణ: వెలుగులోకి సంచలన విషయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-25 14:26:32  IST  )

విజయనగరం పేలుళ్ల కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..

మూడో రోజు విచారణ: వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం పేలుళ్ల కేసు(Vizianagarm Blasts Case)లో రోజు రోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు నిందితుల సమీర్(Sameer), సిరాజ్‌(Siraj)ను గత రెండు రోజులుగా ఎన్ఐఏ అధికారులు(NIA Officers) కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు చేపట్టిన విచారణలో అధికారులకు పలు కీలక విషయాలు తెలిశాయి. పేలుళ్ల జరిపేందుకు నిందితులిద్దరూ సాధారణ జనంలో కలిసిపోయి హైదరాబాద్‌(Hyderabad)తో పాటు విజయనగరం(Vizianagaram), ఢిల్లీ(Delhi), బెంగళూరు(Bengaluru), ముంబై(Mumbai)లో రెక్కీ నిర్వహించారు. అంతేకాదు ఈ పేలుళ్ల కుట్రలో విశాఖ(Visakha)కు చెందిన రిటైర్డ్ రెవెన్యూ అధికారి(Retired Revenue Officers) పాత్ర ఉన్నట్లు అధికారులకు దృష్టికి రావడంతో ఈ అంశంపైనా ఆరా తీశారు.

ఇక తెలంగాణ(Telangana), ఏపీ(Ap), కర్ణాటక(Karnataka), మహారాష్ట్ర(Maharastra)కు చెందిన 12 మంది గ్రూప్‌గా ఉన్నట్లు గుర్తించారు. వీరందరిని సౌదీ హ్యాండర్ల నుంచి ఫ్రండ్ అందడంపైనా కూపీ లాగుతున్నారు. విదేశీయులతో నిందితులకు లింకులు, పేలుళ్ల కుట్ర, ఆర్థిక లావాదేవీలపైనా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. సోషల్ మీడియా ఖాతాలు, అహీమ్ సంస్థ మూలాలు, విదేశీ కాల్స్‌పైనా ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. నిందితులను నాలుగో రోజు సైతం విజయనగరం పోలీసు శిక్షణా కాలేజీలోనే విచారించనున్నారు.

Next Story