‘ఓర్వలేకనే.. వెర్రి కూతలు’.. మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి రేపటికి(జూన్ 4) ఏడాది పూర్తి కానుంది.

‘ఓర్వలేకనే.. వెర్రి కూతలు’.. మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి రేపటికి(జూన్ 4) ఏడాది పూర్తి కానుంది. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పలు సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే.. కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ నేతలు చూడలేకపోతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అభివృద్ధిని ఓర్వలేకనే వైసీపీ నేతలు ‘వెన్నుపోటు దినం’ అంటూ వెర్రి కూతలు కూస్తున్నారని మంత్రి అనగాని మండిపడ్డారు.

ఈ క్రమంలో వెన్నుపోటు దినమంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త నాటకానికి తెరలేపారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. నమ్మి అధికారం ఇస్తే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ తరుణంలో ఐదేళ్లు ప్రజలకు చేసిన మోసానికి వైఎస్ జగన్ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మంత్రి అనగాని సూచించారు.

తల్లిని, చెల్లిని వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగన్‌ను ప్రజలు నమ్మట్లేదని ఆయన తెలిపారు. వైసీపీ అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వైసీపీ పరిస్థితి గుండుసున్నా అని విమర్శించారు. సరిగ్గా ఏడాది(జూన్ 4న) క్రితం రాష్ట్రంలో రాక్షస పాలనకు ఎండ్ కార్డ్ పడింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు జూన్ 4న వెన్నుపోటు దినం కాదు పశ్చాత్తాప దినంగా నిర్వహించుకోవాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

Next Story