- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తనలోని భయాన్ని.. తానే బయట పెట్టుకున్న జగన్’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యల పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు

దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యల పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. వైఎస్ జగన్ రెండు గంటల పాటు మాట్లాడిన అసంబద్ధ వ్యాఖ్యలు, విశ్లేషణలు.. లిక్కర్ కొనుగోలు, విక్రయాలపై ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ పరిణామాల పట్ల ఆయనలో నెలకొన్న తీవ్ర భయాందోళనను స్పష్టం చేశాయని మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యానించారు. అసలు దొంగ ఎవరంటే.. భుజం తడుముకున్నట్లు ఉంది వైఎస్ జగన్ తీరు అని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ చెప్పిన ‘చిన్నగీత-పెద్ద గీత’ కథనం హాస్యాస్పదంగా ఉందని మంత్రి దుయ్యబట్టారు.
గత వైసీపీ ప్రభుత్వం లిక్కర్ విషయంలో ఎటువంటి తప్పు చేయలేదని చెప్పడానికి వైఎస్ జగన్ వ్యర్ధ ప్రయత్నం చేశారని మంత్రి అన్నారు. ఏ తప్పు చేయకపోతే డిజిటల్ పేమెంట్లు ఎందుకు రద్దు చేసినట్లు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో మ్యానువల్ పేమెంట్ల ద్వారా అమ్మకాలెందుకు చేశారో? అనే విషయాన్ని మాత్రం వివరించలేదని మంత్రి విమర్శించారు. ఈ విధానం ద్వారా మద్యం ఆదాయం ప్రభుత్వ ఖాతాలోకి రాకుండా వైసీపీ పెద్దలు భారీగా దోచుకున్నారని, ఇప్పుడు మాజీ సీఎం నంగనాచిలా మాట్లాడటాన్ని ప్రజలు అంగీకరించరు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.






