- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇక నో మోర్ డిస్కషన్స్’.. నిర్మాతలకు భారీ షాకిచ్చిన డిప్యూటీ CM పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేషీ నుంచి సంచలన ప్రకటన విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేషీ నుంచి సంచలన ప్రకటన విడుదలైంది. రాష్ట్రంలో కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయింది. సినిమా వాళ్లలో ఎవరైనా ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. సినిమా రంగ అభివృద్ధికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుంటే.. ఆయన సినిమాకే అడ్డంకులా? అని మండిపడ్డారు. చిత్రసీమ(Telugu Film Industry)లో కొందరి రిటర్న్ గిఫ్ట్‌కి థ్యాంక్స్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి సినిమా వాళ్లతో ప్రభుత్వం వ్యక్తిగత చర్చలు ఉండబోవు అని సంచలన ప్రకటన చేశారు. సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాల్సి ఉంటుందని కండీషన్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సినిమా వాళ్లకు ప్రభుత్వమే ముందుకొచ్చి మరీ సాయం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చాలా కృషి చేసింది. అలాంటిది.. అందరూ కలిసి రావాలన్నా పట్టించుకోరా? అని మండిపడ్డారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసింది. కక్షసాధింపు చర్యలకు దిగింది. కానీ.. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదు. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అయితే.. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేయాలనే నిర్ణయం వెనుక లోగుట్టు ఏంటన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాను అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రగా కొందరు భావిస్తున్నారు. ఇతర సినిమాల సమయంలో రాని అడ్డంకులు పవన్ సినిమా వచ్చేసరికి బయటపడటం వెనుక.. ఒక నలుగురి కుట్ర ఉందనే టాక్ నడుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లను గుప్పిట పెట్టుకున్న ఆ నలుగురు ఎవరు?.. పవన్ సినిమాలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే థియేటర్ల మూసివేత అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారు.






