అమరావతి సాధ్యం కాదు: తమ్మినేని సీతారాం

by Vemula.Srinu Prasad |

అమరావతి సాధ్యం కాదని వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. అమరావతి రాజధాని చట్టబద్ధత కావడంపై ఆయన స్పందించారు...

అమరావతి సాధ్యం కాదు: తమ్మినేని సీతారాం
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి సాధ్యం కాదని వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. అమరావతి రాజధాని చట్టబద్ధత కావడంపై ఆయన స్పందించారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్‌కే సీతారాం మద్దతు తెలిపారు. తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమావేశంలో తమ్మినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధానికి ఎన్ని దశాబ్ధాలు పడుతుందని, నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి ఏటింలా మారిందని విమర్శించారు. రాజధానిపై అమలు కాని హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్లాన్‌ను పరిగణించాలని డిమాండ్ చేశారు. మావిగన్‌కు తక్కువ ఖర్చు అవుతుందని, దీని వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని తెలిపారు. అసలు రాజధానిగా అమరావతిని సెలక్ట్ చేయడమే తప్పు అని సీతారాం వ్యాఖ్యానించారు. రూ. 2 లక్షల కోట్లు రాజధానికి అవసరమని, మూడేళ్లలో అమరావతి సాధ్యమా అని తమ్మినేని సీతారం ప్రశ్నించారు.

Next Story