ఆన్ లైన్​లో అమ్మాయిల ఫొటోలు పంపి..

by Thanuru Gopichand |

స్త్రీలకు మాయమాటలు చెప్పి, వారి ఫొటోలను ఆన్​లైన్​లో యువకులకు పంపి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

ఆన్ లైన్​లో అమ్మాయిల ఫొటోలు పంపి..
X

దిశ, కర్నూలు క్రైం : స్త్రీలకు మాయమాటలు చెప్పి, వారి ఫొటోలను ఆన్​లైన్​లో యువకులకు పంపి వ్యభిచారం (Adultery)నిర్వహిస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నెలలుగా నడుస్తున్న వ్యభిచార ముఠాపై శుక్రవారం దాడులు చేసినట్లు కర్నూల్ నాలుగో పట్టణ సిఐ విక్రమ్ సింహ తెలిపారు. నగరంలోని గుత్తి పెట్రోల్ సమీపంలోని ఓ ఇంటిపై దాడి చేసి వ్యభిచారం ముఠా గుట్టును రట్టు చేశారు. సందర్భంగా సీఐ తెలిపిన వివరాల మేరకు.. అనుమానాస్పదంగా ఉన్న మహిళలు, పురుషులను అదుపులోకి తీసుకుని విచారించగా, విజయవాడ, అనంతపురం, నంద్యాల, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి యువతులు, స్త్రీలను మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దింపుతున్నట్టు తేలింది. ఆన్‌లైన్‌లో ఫోటోలు పంపి యువకులను, వివాహితులను ఆకర్షించి డబ్బు వసూలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దాడిలో నిర్వాహకులు, విటులను అరెస్టు చేశారు. ఎనిమిది బాధిత మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి స్వగ్రామాలకు పంపించారు.

Next Story