- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే గౌతు శిరీష ఫ్యామిలీపై సీదిరి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మహిళ ఎమ్మెల్యేలపై... వైసీపీ మాజీ ఎ

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. మహిళ ఎమ్మెల్యేలపై... వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ... వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై (Vemireddy Prashanthi Reddy)... కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ (Prasanna Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత... ప్రసన్నకుమార్ ఇంటిపై కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి కూడా చేశారు.
ఈ అంశంపై వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కూడా సంచలన పోస్ట్ పెట్టారు. అయితే ఈ పంచాయతీ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో టిడిపి మహిళా ఎమ్మెల్యే పై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Sidiri Appalaju) హాట్ కామెంట్స్ చేశారు. టిడిపి మహిళా ఎమ్మెల్యే గౌతు శిరీష ఫ్యామిలీ పై తాజాగా సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.
లోకల్ టాక్స్ ( lOCAL tAX )అంటూ గౌత్ శిరీష ఫ్యామిలీని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యంపై లోకల్ టాక్స్ వసూలు చేస్తున్నారని మండిపడ్డారు సీదిరి అప్పలరాజు. ఇప్పటికే ఈ విషయంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చామని వెల్లడించారు. అయినప్పటికీ టాక్స్ మాత్రం వసూలు చేస్తున్నారని నిప్పులు జరిగారు. ఆ టాక్స్ ఆపే వరకు పోరాటం ఆగబోదని మాజీ మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు.






