ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం.. నాదెండ్ల మనోహర్ సీరియస్

by Sathputhe Rajesh |   (  Updated:2024-03-18 08:34:38  IST  )

పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు.

ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం.. నాదెండ్ల మనోహర్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని హాజరైన సభలో తీసుకోవాల్సి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. పేర్లు, ఫోటోలు లేకుండానే పాస్‌లు జారీ చేశారన్నారు. కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ఎందుకలా చేశారో తమకు అర్థం కావడం లేదన్నారు. ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నామన్నారు. అధికారులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

Read More..

కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం.. ఆ స్థానం నుంచి ఎంపీగా షర్మిల పోటీ!

Next Story