రాష్ట్రంలోని ఆ మండలంలో 144 సెక్షన్

by Gantepaka Srikanth |

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు.

రాష్ట్రంలోని ఆ మండలంలో 144 సెక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధిపై అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇరు పార్టీల నేతలు బోస్ బొమ్మ సెంటర్‌కు చర్చ కోసం వెళ్తుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బోస్ బొమ్మ సెంటర్ వద్ద భారీగా మోహరించారు. గత రెండు రోజులుగా టీడీపీ - వైసీపీ నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పరిస్థితిపై ఆరా తీసిన స్థానిక తహశీల్దార్ తిరువూరు మండల వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాగా, సెక్షన్ 144 (CrPC 144) అనేది శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రమాదకర పరిస్థితుల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే చోట గుమిగూడకుండా నిషేధించే చట్టం. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే, IPC సెక్షన్ 188 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. ఇది అత్యవసర పరిస్థితులు, అల్లర్లు లేదా ఆందోళనల సమయంలో విధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.

Next Story