భారీగా చేరిన వరదనీరు.. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

by Ajay Maddhiboyina |

ఏపీలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగువ ప్రాంతంలోని వరద నీరు అంతా ప్రకాశం బ్యారేజీలోకి చేరడంతో వరద ఉధృతి కొన‌సాగుతోంది.

భారీగా చేరిన వరదనీరు.. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎగువ ప్రాంతంలోని వరద నీరు అంతా ప్రకాశం బ్యారేజీలోకి చేరడంతో వరద ఉధృతి కొన‌సాగుతోంది. బ్యారేజీలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.62 ల‌క్ష‌ల క్యూసెక్కుల‌కు చేరింది. దీంతో 69 గేట్ల‌ను ఎత్తి నీటిని కింద‌కు విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే లంక గ్రామాల ప్ర‌జ‌ల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు.

లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. బ్యారేజీ నుండి భారీగా కృష్ణా న‌దిలో చేరుతుండ‌టంతో వ‌ర‌ద‌ల దృష్యా స‌రిహ‌ద్దు మండ‌లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. కొల్లూరు మండ‌ల కంట్రోల్ రూమ్ నంబ‌ర్ 77948 94544 కాగా భ‌ట్టిప్రోలు మండ‌ల కంట్రోల్ రూమ్ నంబ‌ర్ 81798 86300గా ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంట‌నే సంప్ర‌దించాల‌ని తెలిపారు.

Next Story