- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాను తీరందాటే ఛాన్స్ లేదు.. 5 పోర్టుల్లో రెండో నంబర్ హెచ్చరికలు జారీ
అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో SDRF, NDRF బృందాలు ఆయా జిల్లాలకు తరలి వెళ్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిత్వా తుపాను తీరందాటే అవకాశం లేదని వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటకుండానే తీవ్ర వాయుగుండంగా(Deep Depression) బలహీన పడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావం ఏపీ జిల్లాలపై రేపటి నుంచి తీవ్రంగా ఉండనుందని, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆకస్మిక వరదలు రావొచ్చని తెలిపారు.
అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో SDRF, NDRF బృందాలు ఆయా జిల్లాలకు తరలి వెళ్తున్నాయి. ఉత్తర కోస్తా, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.
మరోవైపు ఏపీ విద్యుత్ శాఖ అప్రమత్తమయింది. తీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీయనుండటంతో APCPDCL సర్కిల్స్ పరిధిలో కృష్ణా, బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది.






