సీఎం చంద్రబాబు నాయుడుకు ముద్రగడ లేఖ

by Thanuru Gopichand |

దయచేసి కాపు (Kapu) కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండని ఆవేదనను వ్యక్తం చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడుకు ముద్రగడ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. ప్రధానమంత్రిని కోరి ఏపీలో ఎమర్జెనీ పెట్టమని కోరాలని ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును (Chandra Babu Naidu) కోరారు. ఈ మేరకు సోమవారం ఓ బహిరంగ లేఖను (Open Letter) రాశారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెడితే పదవీ కాలం అయ్యే వరకు ప్రతిపక్షాన్ని జైలులో పెట్టడానికి ఉపయోగపడుతుందని తాను అభిప్రాయపడుతున్నా అని పేర్కొన్నారు.

మాజీ మంత్రులు రజనీ, అంబటి రాంబాబు, జోగి రమేశ్ లను అవమానించేలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పాలన ఉందా అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇవ్వడం నుంచి దృష్టి మరల్చేందుకు ఇలాంటివి చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక్క అబద్ధాన్ని కప్పి పుచ్చడానికి వంద అబద్ధాలు ఆడాల్సి వస్తుందని తన తండ్రి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. టీడీపీ నేతలు ఆడిన ఒక్క అబద్ధం వల్ల పార్టీ ఎంత నష్టపోయిందో పరిశీలించుకోవాలని సూచించారు.

కూటమి పాలనలో కాపు కులాన్ని ప్రతిక్షణం టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తన కుటుంబాన్ని, ప్రస్తుతం అంబటి రాంబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఇది ఎంత వరకు సమంజసం అని నిలదీశారు. గతంలో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని మొండి చెయ్యి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మాత్రమే టీడీపీకి మద్ధతునిస్తున్నామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ మద్ధతునివ్వడం వల్లనే చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారన్నారు. కాపుల మద్ధతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిజం కాదా అని అడిగారు. దయచేసి కాపు (Kapu) కులాన్ని ఏపీ నుంచి వేరే రాష్ట్రానికి కట్టుబట్టలతో పంపించే కార్యక్రమం చేయండని ఆవేదనను వ్యక్తం చేశారు.

Next Story